వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టు నిన్న విచారణ జరిపింది. శివశంకర్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కూతురు సునీత ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈనాటి వాదనల సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ… ఈ కేసులో తాము ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టుకు తెలిపారు.
చదవండి: జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నారేమో?: పవన్ కల్యాణ్
కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ రెండో వారంలో తదుపరి విచారణ జరుపుతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్ ల ధర్మాసనం ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి మొదలయ్యే వారంలో లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.