వివాదంలో ‘ఛీ ఛీ’ కెమెరాల వ్యవహారం..!
ఉమ్మడి కృష్ణ జిల్లా గుడివాడ నియోజకవర్గం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లో సీసీ కెమెరాలు కంటపడటంతో ఆందోళనకు దిగారు విద్యార్థినులు. గురువారం అర్థరాత్రి సెల్‌ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు ఎక్కుపెట్టారు. తెల్లవారు 3 గంటల 30 నిమిషాల వరకు ఈ ఆందోళన కొనసాగింది. కెమెరాల ద్వారా విద్యార్థినుల న్యూడ్ వీడియోస్ తీసి అమ్ముకుంటున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై సహచర హాస్టల్ విద్యార్థులు దాడికి కూడా ప్రయత్నించారు. అలాగే, ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు విద్యార్థికి సంబంధించిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణలో నిమగ్నమయ్యారు. కాగా, సదరు విషయాన్ని హాస్టల్ విద్యార్థినులు X వేదికగా పోస్టులు పెట్టడంతో వివాదం చినికి చినికి గాలివానలా మారింది. వారం క్రితమే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా ఒక్కరూ కూడా స్పందించలేదని బాధిత విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే, సదరు వ్యవహారానికి సంబంధించి పోలీసులు కూడా ఇప్పటివరకు వివరాలు వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
చదవండి: రజినీ తో నాగార్జున, రవితేజ
వివాదంలో విద్యార్థిని..?
గుడ్లవల్లేరు బాలికల హాస్టల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంలో సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థికి సహకరించిందంటూ …అదే హాస్టల్‌లో ఉంటున్న ఫైనల్ ఇయర్ విద్యార్థినిపైనా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సదరు విద్యార్థిని సహకారంతోనే బాలికల న్యూడ్ వీడియోస్ సీసీ కెమెరాల ద్వారా తీసి సేల్ చేసుకుంటున్నాడని ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అయితే పోలీసులు తెరవెనుక ఆమెను కూడా విచారిస్తున్నట్టు సమాచారం.
జెత్వానీ కేసేనా?.. గుడ్లవల్లేరు కానరాదా..?
ప్రభుత్వాన్ని కడిగిపారేసిన వైఎస్ఆర్సీపీ..!
బాలీవుడ్ నటి జెత్వానీ కేసులో అత్యుత్సాహం చూపుతున్న చంద్రబాబు సర్కార్…తమ నేతలపై తప్పుడు కేసులు ఎప్పుడు పెడదామా?…ఎప్పుడు అరెస్ట్‌లు చేద్దామా అన్న ఆలోచనలో ఉందని…అసలు జెత్వానీ గురించి చంద్రబాబు సర్కార్‌కి ఏం తెలుసునని…హానీ ట్రాప్‌లో భాగంగా రాజకీయ నేతలను, బిజినెస్‌మ్యాన్‌లను తన వలలో వేసుకుని మోసం చేసిన చరిత్ర జెత్వానీది అని… అది తమ ప్రభుత్వంలోనే గుర్తించి కేసులు పెట్టామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు. కాగా, జెత్వానీ కేసుపై ఇంతలా ఫోకస్ పెట్టిన బాబు సర్కార్‌కి గుడ్లవల్లేరు విద్యార్థినుల జీవితాలు కనపడటం లేదా అంటూ ఘాటుగా ఫైరయ్యారు. ముందు, విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడిన దుర్మార్గులను వదలొద్దని డిమాండ్ చేస్తూనే…దీని వెనుక బడాబడా పెద్దలు కూడా ఉండొచ్చనేది అనుమానంగా ఉందని, పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.