కిడ్నీ రాకెట్ వార్తలపై హోంమంత్రి అనిత ఆగ్రహం

Spread the love

విజయవాడలో కిడ్నీ రాకెట్​పై మీడియాలో వస్తున్న వార్తలకు స్పందించిన హోం మంత్రి అనిత, అధికారులను ఆరా తీశారు. గుంటూరు కలెక్టర్, గుంటూరు ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్​తో మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇటువంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని ఆదేశించారు.

హోంమంత్రి ఆదేశాలతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నీ రాకెట్‌లో మోసపోయిన మధుబాబును పోలీసులు విచారిస్తున్నారు. గుంటూరు నగరంపాలెం అధికారులు లోతుగా విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విజయవాడలో కిడ్నీ రాకెట్‌ మోసాలు వెలుగు చూశాయి. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం కిడ్నీ అమ్మేందుకు ఒప్పుకున్నాడు. అయితే కిడ్నీ తీసుకుని తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నీ ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేశారని తెలిపారు. అయితే ఆపరేషన్ పూర్తయ్యాక కేవలం లక్షా పదివేలు ఇచ్చారని వాపోయారు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే తనను బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే డబ్బు ఆశ చూపి నెలకు ఐదు నుంచి 10 మందికి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్​ఐఆర్ నమోదు చేసినట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్ తెలిపారు. కిడ్నీ రాకెట్ ముఠాపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్​లో బాధితుడు మధుబాబును విచారించిన డీఎస్పీ, కిడ్నీ మార్పిడికి సంబంధించిన వివరాలు, జరిగిన సంప్రదింపులు, లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్​లో ఐపీసీ పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Hot this week

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

Topics

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...