హైదరాబాద్‌లో డీజేలు బంద్‌..

Spread the love

ఇకపై హైదరాబాద్‌లో డీజేలు బంద్‌..!
శబ్ధ కాలుష్యంపై వెల్లువెత్తిన ఫిర్యాదులు..!

ఇక, భాగ్యనగర వాసులకు బ్యాడ్‌న్యూస్‌. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఇకపై డీజేలు నిషిద్ధమని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ధ కాలుష్యానికి దారితీస్తోందని డీజేలపై నిర్ణయం తీసుకున్నారాయన. మరోవైపు డీజేల కారణంగా వచ్చే సౌండ్‌తో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నామని డయల్‌ 100కు ఫిర్యాదులు వెల్లువలా వచ్చిపడ్డాయని తెలిపారు. ఈ క్రమంలో డీజేలపై నిషిద్ధం ఒక్కటే దీనికి సరైన మార్గంగా భావించి నిర్ణయం తీసుకున్నట్టు కమిషనర్‌ సీవీ ఆనంద్ తెలిపారు.

హైదరాబాద్ సౌండ్ పొల్యూషన్‌పై ఇటీవల కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అలాగే వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులూ హాజరయ్యారు. వారందరికీ డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ సీవీ ఆనంద్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రెండేళ్లుగా డీజేల పేరుతో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్నారు సీవీ ఆనంద్.

కాగా, ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జనం వేళ డేజీలు, టపాసులతో మోత మోగించారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు. గ్రేటర్ వ్యాప్తంగా పరిమితికి మించి శబ్ధ కాలుష్యం వెలువడింది. చాలా ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన దానికంటే చాలా రెట్లు ధ్వనికాలుష్యం మించిపోయింది. శబ్ధ కాలుష్యంతో పిల్లలు, వృద్ధులలో వినికిడి సమస్యలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిమితికి మించి శబ్ధ కాలుష్యం కలిగించి ఎన్‌జీటీ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇటీవల మహారాష్ట్రలో పలు ఉత్సవ కమిటీ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తోందని పలువురు ఆక్షేపిస్తున్నారు. కాగా, తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాలో డీజేల వినియోగం చాలా తక్కువ.

Hot this week

500 వందల కోట్లు కొల్లగొట్టిన ‘ దేవర ‘

దేవర’ను బ్లాక్ బస్టర్ సక్సెస్ చేసినందుకు అభిమానులు, బృందం, ప్రేక్షకులు, పంపిణీదారులు,...

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా రశ్మిక మందన్న

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన నేషనల్...

“లవ్ రెడ్డి” ట్రైలర్ రిలీజ్ చేసిన ఎస్ కేఎన్.

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ చేతుల మీదుగా "లవ్ రెడ్డి"...

అప్పుడు నాగార్జున “డాన్” ఫ్లాప్..ఇప్పుడేమవుతుందో

నాగార్జున కెరీర్ లో ఫ్లాప్ సినిమాల్లో డాన్ ఒకటి. లారెన్స్ దర్శకత్వం...

రోరింగ్ స్టార్ శ్రీమురళి ‘బఘీర’ అక్టోబర్ 31న విడుదల.

రోరింగ్ స్టార్ శ్రీమురళి, ప్రశాంత్ నీల్, డాక్టర్ సూరి, విజయ్ కిరగందూర్,...

Topics

సాయి దుర్గ తేజ్ #SDT18 “ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” రిలీజ్.

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

శ్రుతి “డెకాయిట్”ను వదిలేసిందా ?

శ్రుతి హాసన్ గ్లామర్ ఉన్న ఎంటర్ టైనింగ్ మూవీస్ తో పాటు...

వారసుడి కోసం దిల్ రాజు మరో ప్రయత్నం

తొలిప్రేమ ఓ సంచలనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కెరీర్ లో...