హైడ్రా కూల్చివేతలపై నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. FTL, బఫర్‌జోన్లలో ఇప్పటికే ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వాటిని తాము పడగొట్టమని…ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న వాటిని మాత్రమే కూల్చే పనిని పెట్టుకున్నామని స్పష్టీకరించారు. నివాసం ఉంటున్న ఏ ఇంటినీ కూల్చబోమన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓవైపు హామీ ఇవ్వగా…మరోవైపు FTL, బఫర్‌జోన్లలో ఉన్న స్థలాలు, కట్టడాలు కొనుగోలు చేయొద్దని సూచించారు. రంగనాథ్ ప్రకటనతో చెరువుల భూములను కబ్జాచేసి అక్రమ కట్టడాల్లో నివాసం ఉంటున్న వారికి కాస్త ఊరట కలిగినట్టయింది.
చదవండి: కేరళ గవర్నమెంట్ ఆస్పత్రుల్లో షూటింగ్స్ నిషిద్ధం..?
ఆ అధికారాలూ హైడ్రాకేనా..?
నగరంలోని అక్రమ నిర్మాణాలపై గురిపెట్టిన హైడ్రా.. బ్రేకులు లేకుండా దుసుకెళ్తోంది. దీనికితోడు HMDA పరిధిలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీ బాధ్యతలను కూడా ప్రభుత్వం హైడ్రాకు అధికారాలు అప్పగించింది. ఇంకేముంది…ఆయా ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన కబ్జాదారులకు గుండె గుబేలుమంది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని చెరువులను ఆక్రమించి ఎవరైనా బిల్డింగ్‌లు, భవంతులు నిర్మిస్తే ఇక అవి కూల్చుడే అన్న సంకేతాలు బలంగా వెళ్లిపోవడంతో ఇప్పుడు సర్వత్రా వాటిపైనా చర్చసాగుతోంది.