కావాలనే రాజకీయ దురుద్దేశంతోనే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. అదేవిధంగా కక్షపూరితంగానే ఆయనను జైలులో పెట్టించారని ఆరోపించారు.
తీరా అరెస్ట్ చేసే సమయంలో కూడా ఆయనపై దాడి చేసేందుకు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. గతంలో బాబు తెచ్చిన జీవో ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. కానీ, అధికారులు అత్యుత్సాహంతో నిర్మాణంలో ఉన్న భవనాలను అక్రమంగా కూల్చి వేయడం సమంజసం కాదన్నారు. టీడీపీ కుట్రలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని అంబటి ధ్వజమెత్తారు. మరోవైపు టీడీపీ నేతల పైనే పిన్నెల్లి దాడి చేశారని.. తెలుగు తమ్ముళ్లు పేర్కొనడం గమనార్హం.