ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్కు ఇంకా తత్వం బోధపడినట్లు లేదని కూటమి శాసనసభ పక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెప్తూ కుట్రలకు తెరలేపుతున్నాడని పవన్ కల్యాణ్ ఆక్షేపించారు.
చదవండి: ఎవరి పాపం పండిందో ఎన్నికల్లో ప్రజలే చెప్పారు: మంత్రి నారా లోకేశ్
సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలు రెచ్చకొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానని భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమోనని ఎద్దేవాచేశారు. రాష్ట్ర అభివృద్ధికి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు తాను ,జనసేన పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తుందని స్పష్టం చేశారు.