పాలన వదిలేసి చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. అమాయకుడైన తన కుమారుడిపై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. అమెరికాలో చదువుకున్న రాజీవ్ త్వరలో ఉద్యోగం కోసం అక్కడికే వెళ్లబోతున్నాడని…ఇలాంటి సమయంలో తప్పుడు కేసు పెట్టడం దారుణమని వాపోయారు.
ఆ భూములు అగ్రిగోల్డ్ సంస్థవన్న విషయం తెలియదని, అలాంటి భూములు రిజిస్ట్రేషన్ కావని తెలిస్తే ఎలా కొంటానని, అయినా కొనేముందు పత్రికల్లో ప్రకటన ఇచ్చిమరీ కొన్నానని గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడారు.
చదవండి: రాష్ట్రానికి చంద్రబాబు అవసరం
కేసులో రాజకీయ జోక్యం లేదన్న మంత్రి అనగాని
అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేశారని రుజువైన తర్వాతే పూర్తి సాక్ష్యాధారాలతో రాజీవ్‌ను, అలాగే ఆయన చిన్నాన్న వెంకటేశ్వరరావుపై ఏసీబీ అధికారులు కేసు నమోదుచేశారని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
అగ్రిగోల్డ్ యజమాని పెట్టిన కేసు, డబుల్ రిజిస్ట్రేషన్, ర్యాటిఫికేషన్ అన్నీ నిర్థారణ అయిన తర్వాతే అరెస్ట్‌లు జరగాయని వివరించారు.