ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న US అధ్యక్షుడు బైడెన్ తన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిసన్ను నామినేట్ చేశారు. ‘2020లో ప్రెసిడెంట్గా నామినేట్ అయినప్పుడు ఆమెను ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేయడం నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. డెమోక్రటిక్ పార్టీ నామినీగా కమలాకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని తెలిపారు. అందరం కలిసికట్టుగా ట్రంప్ను ఓడించాల్సిన సమయం వచ్చిందని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: గతంలో ఏం చేశావో గుర్తుచేసుకో జగన్ – హోం మంత్రి అనిత
US అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ తనను నామినేట్ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. బైడెన్ నిస్వార్థంగా దేశానికి సేవలు అందించారని కొనియాడారు. డెమోక్రటిక్ పార్టీలో, దేశంలో ఐక్యత తెచ్చేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికలకు మరో 107 రోజులే ఉందని, అందరం కలిసికట్టుగా పోరాడి విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.