బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు పార్టీ హైకమాండ్ షాకిచ్చింది. పార్టీ తరఫున విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం ఎంపీ కంగనా రనౌత్‌కు లేదని, అందుకు ఆమెకు అనుమతి కూడా ఇవ్వలేదని తెలిపింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ఓ ప్రకటన జారీచేసింది. కంగానా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది.
చదవండి: పెళ్లెప్పుడు బాబూ…? రాహుల్‌ని వదలని పెళ్లిగోల..?
అసలు కంగనా కామెంట్స్ ఏంటి..?
రైతు నిరసనల విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకుంటే మనదేశంలో కూడా బంగ్లాదేశ్ లాంటి సంక్షోభం ఏర్పడవచ్చని కంగనా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. కంగనాను సున్నితంగా మందలించిన బీజేపీ అధిష్టానం వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. సామాజిక సామరస్య విధానాల విషయంలో పార్టీ నిబద్ధతతో ఉందని పునరుద్ఘాటించింది.