అభయను హత్యాచారం చేసింది నేను కాదు..?
పాలిగ్రాఫ్ టెస్టులో బిగ్ ట్విస్ట్..!
కోల్‌కతాలోని అభయ హత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టై ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ ..అసలు తాను నేరమే చేయలేదని పాలిగ్రాఫ్ టెస్టులో చెప్పడం అందరినీ షాక్‌కు గురయ్యేలా చేసింది. కోల్‌కతా ప్రెసిడెన్సీ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంజయ్‌కు అదే జైల్లో లై డిటెక్టర్ పరీక్ష చేయగా.. అన్నీ పొంతనలేని సమాధానం చెప్పినట్లు సమాచారం. తాను ఫెసిలిటీ సెమినార్ హాల్‌కు చేరుకున్నప్పుడు అభయ అప్పటికే మృతి చెంది ఉందని, భయంతో అక్కడి నుంచి పారిపోయానని లై డిటెక్టర్ టెస్టులో సంజయ్ పేర్కొన్నాడు. అంతేకాక అభయ కేసులో తాను నిర్దోషినని పాలిగ్రాఫ్ టెస్ట్‌లో చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. కావాలనే కొందరు తనను ఈ కేసులో ఇరికించారని చెప్పుకొచ్చాడు.
చదవండి: తనపై బుల్లెట్లతో దాడి చేయండన్న అక్బరుద్దీన్…
మొన్న అలా…నేడు ఇలా..?
పాలిగ్రాఫ్ టెస్టులో తాను హత్యాచారమే చేయలేదు, అభయ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్న సంజయ్… ఆర్జీ కర్ కాలేజీలో ఆగస్టు 9న అసలు ఏం జరిగిందో, ఎలా మెడికోను రేప్‌చేసి చంపాడో పూసగుచ్చి తమకు చెప్పాడని, అందుకే అరెస్ట్ చేయడం జరిగిందని పోలీసులు అంటున్నారు. అంతేకాదు ఆ రోజు సెమినార్ హాల్‌లోకి సంజయ్ వెళ్తున్న విజువల్స్‌ను సీసీ కెమెరాల్లో గుర్తించారు. పైగా సంఘటనా స్థలిలో అతడి బ్లూటూత్ హెడ్‌సెట్‌నూ కనుగొన్నారు. నిందితుడు సంజయ్ ద్వంద్వ వైఖరి చూస్తుంటే అసలు పశ్చాత్తాపమే కనపడటంలేదని విచారణలో పాల్గొన్న సీబీఐ అధికారులు అంటున్నారు. అయితే తనను ఇరికించారని, నిర్దోషినని కన్నీటిపర్యంతం అవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు తాను కూడా లై డిటెక్టర్ పరీక్షకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.