కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన దారుణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. తన కొడుకును ఎవరో ఇరికించారని చెబుతోంది. అసలు దోషులను పట్టుకుని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
మాది అందమైన కుటుంబం..!
సంజయ్ తల్లి కన్నీటిపర్యంతం..!
సంజయ్ తనను మంచిగా చూసుకునేవాడని ఆమె తల్లి చెప్పింది. కొడుకు సంజయ్ గురించి ఇరుగుపొరుగు వారందరినీ కూడా అడగవచ్చనని.. తాను ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించలేదని, ప్లీజ్ అందరూ తెలుసుకోండని కోరుతోంది. అంతేకాదు కొడుకుతో తాను మరింత కఠినంగా ఉండి ఉంటే, ఇవన్నీ జరిగేవి కావని తెలిపింది. నా భర్త మరణంతో అంతా తప్పు జరిగింది. నా అందమైన కుటుంబం ఇప్పుడు జ్ఞాపకం మాత్రమేనంటూ కన్నీటి పర్యంతమయింది సంజయ్ తల్లి.
చదవండి: మలయాళీలో కామఖేళీ..? హేమ రిపోర్టుపై హీరో నాని ఆవేదన..!
రేపో,మాపో సంజయ్‌కు పాలిగ్రాఫ్..?
సీఐడీ విచారణలో సంజయ్ వాంగ్మూలం అంతా తప్పులతడకగా ఉండటంతో అతని లై డిటెక్షన్ పరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక కోర్టును అధికారులు ఆశ్రయించగా..ఇందుకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో, ఈ క్రమంలో సంజయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ రేపో, మాపో జరిగే అవకాశం ఉందని, అందులో నిజనిజాలు నిగ్గు తేలే అవకాశం లేకపోలేదన్నది నిపుణుల మాట.