సమంత-చైతూ విడిపోవడానికి కేటీఆర్‌ కారణం: మంత్రి కొండా సురేఖ

Spread the love

సమంత-చైతూ దూరానికి కేటీఆర్‌ కారణం: మంత్రి కొండా సురేఖ
హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్‌: మంత్రి కొండా సురేఖ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హీరోయిన్ల జీవితంలో ఆడుకునే వ్యక్తి కేటీఆర్‌ అని, వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసి ఫోన్లు ట్యాప్ చేయడం ఆయనకున్న అలవాటని వ్యాఖ్యలు చేయడమే కాదు, చైతూ-సమంత విడిపోవడానికి కూడా కారణం కేటీఆర్‌నే అని బాహాటంగానే బాంబు పేల్చడంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది.

కేటీఆర్‌కు తల్లి, అక్కాచెల్లెలు లేరా ప్రశ్నించారు కొండాసురేఖ. తనపై బీఆర్‌ఎస్ వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఒక మనసున్న మనిషిగా హరీశ్‌రావు స్పందించాలని కోరారామె. తాను బీఆర్‌ఎస్‌లో ఐదేళ్లు పనిచేసానని, తన వ్యక్తిత్వం ఏంటో ప్రతిఒక్కరికీ తెలుసునని కొండా సురేఖ అన్నారు. తమ ప్రభుత్వం తప్పు చేస్తే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ, వ్యక్తిత్వాలను చంపే ప్రయత్నం చేయకూడదన్నారు.

చదవండి: సమంత నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం – మంత్రి కొండా సురేఖ

కాగా, ఇటీవల దుబ్బాకలో నిర్వహించిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఆమెను స్వాగతించే క్రమంలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునంద్‌రావు …చేనేత నూలు దారంతో తయారుచేసిన దండవేశారు. అయితే ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ద్వందార్థం వచ్చేరీతిలో కొందరు నెట్టింట ట్రోల్స్ చేశారు. దీనిపై మనోవేధనకు గురైన కొండా సురేఖ గత నాలుగైదు రోజులుగా బీఆర్‌ఎస్‌ను తప్పుపడుతూ వస్తోంది. తనపై చేస్తోన్న ట్రోలింగ్ వెనుక కేటీఆర్ ఉన్నారని నాటినుంచి ధ్వజమెత్తుతూనే ఉండగా…

ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ… నాగచైతన్య- చైతూ విడిపోవడానికి కారణం కేటీఆర్‌… ఇండస్ట్రీలో డ్రగ్స్‌ అలవాటుచేసి హీరోయిన్లను వాడుకున్న వ్యక్తి కేటీఆర్‌ అంటూ బాహాటంగానే తీవ్ర ఆరోపణలు గుప్పించడంతో ట్రోలింగ్‌తో మొదలైన ఈ రాజకీయ రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.

Hot this week

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

Topics

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...

‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్

మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....

‘తండేల్’ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అల్లు అరవింద్ ప్రెజెంట్స్, నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ...