మనది గ్రామం అయితే…! వారిది కుగ్రామం అలాంటి ప్రదేశం మన పెదకళ్ళేపల్లి పంచాయతీలో ఉన్న అడపా వారి పాలెం.అలాంటి ప్రదేశం నుండి మనం కలలు కనే అమెరికాలో అదీ ఐక్యరాజ్యసమితి ఆహ్వానంతో ఉన్నత స్థాయి ప్రతినిధుల ముందు ప్రసంగించే అవకాశం వస్తే…. అద్బుతం కదా..?
అలాంటి అవకాశాన్ని పొందిన శ్రీ పండలనేని శివ ప్రసాద్ కుమారుడు పండలనేని కృష్ణ కిషోర్ గారు USA లోని కొలంబియా యానివర్సరీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యను అభ్యసిస్తూ.. ఐక్యరాజ్యసమితిలో ఉన్నత స్థాయి రాజకీయ సమూహం ముందు “సుస్థిర అభివృద్ధి” అనే అంశంపై ప్రసంగించే అవకాశం పొందటం, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి తన ప్రతిభతో ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం పొందే స్థాయికి చేరుకోవడం మనందరికీ గర్వకారణం.