కొండా సురేఖ ఏడిస్తే నా తప్పేంటన్న కేటీఆర్
నాకు భార్యా, పిల్లలు లేరా? అని సూటి ప్రశ్న
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్స్ వస్తే తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆమెపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులతో తనకు సంబంధం లేదన్నారు. కొండా సురేఖ ఏడిస్తే తమకు, తమ పార్టీకి సంబంధం లేదని ఉద్ఘాటించారు. తమపై ఆరోపణలు చేసేముందు తమకూ ఓ కుటుంబం ఉంటుందని, ఆ ఇంట్లో ఆడవాళ్లు బాధపడరా? ఏడవరా? అంటూ ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేసేముందు…హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశానని కొండా సురేఖ అనలేదా అని కేటీఆర్ గుర్తుచేశారు. ఏం..ఇదివరకు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన బూతులు గుర్తులేవా అని ఘాటుగా ఫైర్ అయిన కేటీఆర్…ముందుగా సీఎం రేవంత్‌రెడ్డి నోరును సీతక్క, సురేఖ ఫినాయిల్‌తో కడగాలని సూచించారు.
చదవండి: మంత్రి కొండాకు కౌంటర్..? హీరోయిన్లంటే చిన్నచూపా అన్న ప్రకాశ్‌రాజ్..!
గురువారం కేటీఆర్ మూసీ బాధితుల పరామర్శ..!
టెన్షన్ వాతావరణంలో ఎల్బీనగర్..!
హైడ్రా విషయంలో తమకు సమాధానం చెప్పే దమ్ములేకనే కాంగ్రెస్ దాడులు చేయిస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సెక్యూరిటీ లేకుండా మూసీప్రాంతంలో తిరగండని మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబులు సవాల్ చేస్తున్నారు. అసలు కాంగ్రెస్‌లోనే హైడ్రాపై వ్యతిరేకత ఉందని…దానికి జగ్గారెడ్డి, మధుయాష్కీలే నిదర్శనమని కేటీఆర్ తెలిపారు. మూసీ బాధితుల పరామర్శ కోసం గురువారం ఎల్బీనగర్ వెళ్తున్నానని…కాంగ్రెస్ వాళ్లు అడ్డొస్తే ఏం చేయాలో అది చేస్తామని, తమకు ఆత్మరక్షణ కూడా ముఖ్యమేనని కేటీఆర్ చెప్పడం రాజకీయ వర్గాల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది.