రేవంత్..సెక్యూరిటీ లేకుండా రా..?
‘రుణ’మాఫీపై బీఆర్‌ఎస్ ‘రణం’
రుణమాఫీ విషయంలో ఇంకా కేటీఆర్-రేవంత్ మధ్య చిచ్చు చల్లారడం లేదు. సవాళ్లపై సవాళ్లు విసురుతున్నారు ఇటు కేటీఆర్. మొన్నామధ్య నూటికి నూరుశాతం రుణమాఫీ అమలు చేస్తే తాను పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసరగా…దానికి కౌంటర్‌గా చెప్పినదాని ప్రకారం రుణమాఫీ అమలు చేశాం, రాజకీయాలు నుంచి తప్పుకో కేటీఆర్ అంటూ అటు రేవంత్ మాటల తూటాలు పేల్చారు. అయితే, 40వేల కోట్ల రుణమాఫీ చేస్తానని గద్దెనెక్కి సుమారు 18వేల కోట్లే విదిల్చి హామీ అమలు చేశామంటే ఎలా రేవంత్ అంటూ కౌంటర్ అటాక్ చేశారు కేటీఆర్. ఇక అప్పటినుంచి నేటిదాకా సీఎం రేవంత్‌పై రుణమాఫీ విషయంలో బీఆర్‌ఎస్ పట్టుబిగిస్తూ మాటల యుద్ధం పెంచుతోంది. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత కాకపుట్టించాయి. రేవంత్‌కు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని, రైతుల నుంచి స్పందనేంటో తెలుసుకోవాలని తనదైన శైలిలో కేటీఆర్ సవాల్ విసిరారు.
చదవండి: కవితకు క్షీణించిన ఆరోగ్యం.. తీహార్ జైలు నుంచి ఎయిమ్స్‌కు…?
నీ లాగుల్లో తొండలు వదులుతాం..?
వదిలేది లేదన్న కేటీఆర్..!
రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రూ. 2 లక్షలు రుణ మాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ భారీ ధర్నా చేపట్టింది. చేవెళ్లలో నిర్వహించిన ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ‘రైతు రుణమాఫీ చెయ్యకపోతే నీ లాగుల్లో తొండలు వదిలి రుణమాఫీ అయ్యేదాకా వదిలిపెట్టం’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.