కుమారదేవం సినిమా చెట్టు ఇకనుంచి ఒక చరిత్ర

Spread the love

కుమారదేవం సినిమా చెట్టు ఇకనుంచి ఒక చరిత్ర. ఈ తెల్లవారుజామున గోదావరి వరదతో చెట్టు కూలిపోయింది. కొవ్వూరు మండలం తాళ్ళపూడి దగ్గర్లోని కుమారదేవం గ్రామంలో ఈ నిద్ర గన్నేరుచెట్టును గోదారితల్లి ఒడ్డున నాటారు మహానుభావుడు శ్రీ సింగలూరి తాతబ్బాయి గారు. ఎన్నో వరదల్నీ తుఫాన్లనీ, తట్టుకుంటా తరతరాల్ని చూసుకుంటా పెరిగి మహా వృక్షమైన దీన్ని పేరు కూడా మర్చిపోయి సినిమా చెట్టు అని పిలుస్తారిక్కడి జనాలు. అలా అనడానికి కారణం దీనికింద పాడిపంటలు, దేవత, వంశవృక్షం, బొబ్బిలిరాజా, హిమ్మత్ వాలా, సీతారామయ్యగారి మనవరాలు ఇలా లెక్కెట్టు కుంటా పొతే మొత్తం నూటెనిమిది సినిమాల షూటింగ్ జరిగింది .కెమేరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేము దానంతటదే వచ్చేస్తుంది. అంత మహత్యం ఈ చెట్టుది. ఇంకో విషయం ఈ చెట్టు కింద ఒక్క షాట్ తీస్తే చాలు సిన్మా సూపర్ హిట్టు అన్న సెంటిమెంటు కూడా వుంది. దర్శకుడు వంశీ గారు అయితే ఈ చెట్టు లేకుండా సినిమా తీయరు. రాఘవేంద్రరావు గారు, దాసరి గారు, జంధ్యాల గారు, ఇవివి గారు, ఇలా గొప్ప డైరెక్టర్లందరూ ఈ చెట్టు చుట్టూ తిరిగినవారే.

చదవండి: కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా.. మళ్లీ టెన్షన్..

145 ఏళ్లనాటి సినిమా చెట్టు
ఈ చెట్టు వద్ద 108 సినిమాల చిత్రీకరణ
వంశీ దర్శకత్వంలో 18 చిత్రాల షూటింగ్‌
1974 లో వచ్చిన పాడిపంటలు
చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి పాటనుండి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం సీతా రామయ్య గారి మనవరాలులో సమయానికి…, గోదావరిలో ఉప్పొంగేలే గోదావరి లాంటి పాటలు… ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూపోతే వందలాది పాటలు…
జనాలగుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి…
ఎన్నో వరదల్నీ తుఫాన్లనీ, తట్టుకుంటా తరతరాల్ని చూసుకుంటా పెరిగి మహా వృక్షమైన సినిమా చెట్టు ఇక లేదు అనే వార్త నిజంగా బాధాకరం.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...