అయ్యప్ప భక్తులకు కేరళ సర్కార్ గుడ్‌న్యూస్..!
భక్తులకు ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్..!
దేశవ్యాప్తంగా అయ్యప్ప దీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు ఉచితంగా జీవిత బీమా సదుపాయం కల్పించేందుకు పూనుకుంది. శనివారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగి సమీక్షా సమావేశంలో అయ్యప్ప భక్తులకు ఇచ్చే ఇన్సూరెన్స్‌పై చర్చించారు.
అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు శబరిమల యాత్ర సందర్భంగా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షల బీమా అందజేయనుంది కేరళ ప్రభుత్వం. అంతేకాదు, సదరు భక్తుడు మృతదేహాన్ని వారి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందనేది అధికారిక వర్గాల సమాచారం.
బీమాకు అవసరమయ్యే భక్తుల ప్రీమియాన్ని ట్రావెన్ కోర్ దేవస్వామ్ బోర్డు చెల్లిస్తుంది. రెండునెలలకు పైగా కొనసాగే అయ్యప్ప స్వాముల దీక్షల నేపథ్యంలో శబరిమల ఆలయం నవంబర్ 16న తెరచుకోనుంది.