సెప్టెంబర్‌ 7 నుంచి వైన్‌షాపులు బంద్‌..?

Spread the love

చంద్రబాబుకు జగన్ ఉద్యోగుల అల్టిమేటం..!

సెప్టెంబర్‌ 7నుంచి వైన్‌షాపులు బంద్‌..?

దశలవారీ మద్యపాన నిషేధమంటూ 2019 ఎన్నికల్లో హామీఇచ్చి గద్దెనెక్కిన వైస్ జగన్ ఆ మేరకు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం…ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు నడపడం. అంతేనా… మద్యంషాపుల్లో ఉద్యోగాల పేరుతో ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్ తరఫున కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించి…మందుబాబులకు షాక్‌ కొట్టేలా రేట్లు ఉంటాయన్న మాటను నిలబెట్టుకుని ఆమేరకు బాటిల్ ధరలు పెంచి దీనివెనుక సీఎం హోదాలో జగన్ పెద్దస్కామ్‌కు తెరలేపారన్న నిందను మూటగట్టుకున్నారు. అయితే, మందుబాబుల నుంచి వ్యతిరేకత పసిగట్టిన చంద్రబాబు…తాము అధికారంలోకి వస్తే పాత మద్యం విధానాన్ని తీసుకువచ్చి సరసమైన ధరల్లో మందుబాటిళ్లు సప్లై చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం మారినా, నాడు జగన్ పాలనలో ఒప్పందం మేరకు ప్రస్తుత మద్యం పాలసీ నడుస్తోందని, ఇది కొన్నిరోజుల్లో ముగిసిపోతుందని, మళ్లీ పాత మద్యం బ్రాండ్లు వచ్చేస్తాయన్న వార్తల నేపథ్యంలో వైన్‌షాపుల్లో పనిచేసే ఉద్యోగులు చంద్రబాబు సర్కార్‌కు అల్టిమేటం జారీచేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, లేకుంటే సెప్టెంబర్‌ 7నుంచి వైన్‌షాపులు బంద్‌ చేస్తామని హెచ్చరించారు.

చదవండి: నేను జగన్ తోనే – రోజా

కొత్త వద్దు…పాతే ముద్దు..?
ఇప్పటికే కేబినెట్‌ నిర్ణయం..!

జగన్ తీసుకొచ్చిన ప్రస్తుత మద్యం పాలసీ కొన్నిరోజుల్లో ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో గడిచిన కేబినెట్‌ భేటీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మద్యం పాలసీని రద్దుచేసి, పాత మద్యం విధానాన్ని తీసుకొచ్చేలా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో వైన్‌షాప్‌లు రన్‌చేసి వేలాదికోట్లు జగన్ దండుకున్నారన్న ఆరోపణలపైనా ఓవైపు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత బాబు సర్కార్‌ తమ ఉద్యోగాలు తీసేసి పాత విధానాన్ని తీసుకొచ్చేస్తుందన్న ఆందోళనతో వైన్‌షాపుల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఈ నెల 7నుంచి షాపుల బంద్‌కు పిలుపునివ్వడం సర్వత్రా చర్చకు దారితీసింది. మరోవైపు సదరు ఉద్యోగులు తీసుకున్న నిర్ణయం బాబుకు మరింత కలిసివస్తుందని, అనుకున్నదానికంటే ముందుగా తన మదిలో ఉన్న పాత మద్యం విధానాన్ని తెరపైకి తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Hot this week

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

Topics

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

‘పొట్టేల్’ అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అజయ్, యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, సాహిత్ మోత్ఖూరి, నిసా...

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి వెర్సటైల్ స్టార్...

‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు

మా నాన్న సూపర్ హీరో' ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....