YSRCP ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం సినిమా ట్విస్ట్‌లను తలపిస్తోంది. ఇది పూర్తిగా రాజకీయ కుట్రంటూ, రాజకీయాల్లో తన భార్య ఎదుగుదలను ఓర్వలేకనే ఇలా చేశారంటూ అమెరికాలో ఉన్న మాధురి భర్త మహేశ్ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
నా భార్య బంగారమన్న మహేశ్
తన భార్యపై పూర్తి నమ్మకం ఉందన్నారు మాధురి భర్త మహేశ్. అమెరికాలో ఉన్న మాధురి భర్త దివ్వెల మహేశ్ చంద్రబోస్ తాజాగా ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదన్న ఆయన..మాధురి ఇష్టపడటంతో వైసీపీలోకి వెళ్లడానికి సుముఖం వ్యక్తంచేశానని తెలిపారు. ఆమె రాజకీయంగా ఎదుగుతుందనే కావాలని ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.
చదవండి: అన్నా క్యాంటీన్లలో ‘పవన్’ ఫోటో వివాదం
దువ్వాడకు మాధురి భర్త సపోర్ట్?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారంలో ఇప్పుడు మహేశ్ స్పందన అందరినీ షాక్ గురిచేసేలా చేసింది. టీవీల్లో, సోషల్ మీడియాలో, వెబ్‌సైట్లలో సీరియల్స్ మాదిరి వారిద్దరి వార్తలు వస్తున్నా అవేమీ పట్టించుకోకుండా మహేశ్ తన భార్య మాధురివైపే ఉండటం సర్వత్రా చర్చకు దారితీసింది.
ఆస్పత్రి నుంచి మాధురి డిశ్చార్జ్
దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌లో తనను ట్రోలింగ్ చేస్తున్నారన్న మనస్తాపంతో ఆగిఉన్న కారును తన కారుతో ఢీకొట్టి మాధురి సూసైడ్ అటెంప్ట్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే పలాసలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్న ఆమె డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. దువ్వాడ వాణి తనను రాజకీయంగా ఎదగకుండా చేద్దామన్న ఉద్దేశంతోనే.. భర్త దువ్వాడ శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం అంటగట్టి తనను బజారుకీడ్చే కుట్రకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారామె.