మాజీ మంత్రి పేర్ని నానిపై మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన వైసీపీ కార్యాలయ భవన నిర్మాణాలపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పేర్ని నాని సీఎం చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు. పేర్ని నాని చేసిన ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు.
ఐదేళ్లు రాష్ట్రిలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదన్నారు. వై నాట్ 175 అన్న జగన్ ఉన్నది ఊడగొట్టుకుని వచ్చే ఐదేళ్లలో జరిగే ఎన్నికల గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మచిలీపట్నంలో పేర్ని నానికి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నాడని ద్వజమెత్తారు. ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేర్ని నాని చేసిన అవినీతిని