రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఇసుక విధానం అమల్లోకి రావడంతో కృష్ణాజిల్లాలో ఉచిత ఇసుక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో ఇసుకను వినియోగదారులకు సరఫరా చేసేందుకు రీచ్ లేకపోవడంతో ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతుంది. దీనిపై స్పందించిన గనుల, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ కొల్లు రవీంద్ర స్పందించారు.
కృష్ణా జిల్లాలో రీచ్ లు లేకపోవటం వలన కొంత ఇబ్బంది వచ్చిందని ఇప్పుడు వర్షాకాలం రావడంతో మూడు నెలల పాటు ఇబ్బందులు తప్పవని మూడు నెలల అనంతరం అన్ని రీచులను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజా అవసరాలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఇస్టాను సారంగా తవ్వేసి దూసేసిందని దాంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.