నాగాయలంక కృష్ణా నది తీరాన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని వారాహి అమ్మవారి కి తొమ్మిది రోజులు పాటు నిర్వహించే నవరాత్రుల్లో భాగంగా శనివారం సాయంత్రం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ విజయలక్ష్మి దంపతులు, అవనిగడ్డ డిఎస్పిపి.మురళీధర్ సతీమణి అరుణ్ కుమారి పాల్గొన్నారు.
ముదునూరి శ్రీనివాసశాస్త్రి, అచ్యుత శేఖర శర్మ, దివి మురళి ఆచార్యులు బ్రహ్మత్వలో వారాహి మాత ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులను మాజీ ఏఎంసి చైర్మన్ మండల బాలవర్ధి తదితరులు ఘనంగా దృశ్యాలు వాలతో సత్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కార్యక్రమానికి పర్యవేక్షించారు.