విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో గెలుపుపై ఇంచుమించుగా ఓ క్లారిటీ వచ్చేసింది. అభ్యర్థిని పెడదామా, వద్దా అన్న ఆలోచనల్లో తర్జన భర్జన పడిన కూటమి సర్కార్… ఎట్టకేలకు బరినుంచి తప్పుకోవడంపై బొత్సను విజయం వరించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
చదవండి: శనివారమే కొడతాడా.. ఆదివారం కొట్టడా ?
అతడు తగ్గితేనే వైసీపీ విజయం..?
అయితే వాస్తవానికి విశాఖ ఎమ్మెల్సీ బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్ దాఖలు చేసారు….అయితే ఉపసంహరణ సమయానికి ఆయన చేత వైఎస్ఆర్సీపీ శ్రేణులు విత్ డ్రా చేయించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పండితుల మాట. ఇదంతా సవ్యంగా జరిగితే బరిలో ఒకే ఒక్కడుగా ఉన్న బొత్సనే ఎమ్మెల్సీగా 16న ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లేదంటే ఈ నెల ౩౦న షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరుగుతుంది.