టీడీపీలో చేరికపై ఎంపీ మోపిదేవి క్లారిటీ..!
వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటన..!
వైసీపీ నుంచి వలసలు జోరందుకున్న వేళ బుధవారం వరకు తనపై సాగిన వార్తలకు చెక్‌పెట్టారు ఎంపీ మోపిదేవి. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు నేరుగానే ప్రకటించారు. మరోవైపు తన రాజీనామా వెనుక బలమైన కారణాలు ఉన్నాయని చెప్పిన ఆయన…అన్నీ బయటకు చెప్పుకోలేనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని, మొన్న అసెంబ్లీ టికెట్ ఇవ్వనప్పుడే మనస్తాపం చెందానని తన మనసులోని బాధను వ్యక్తంచేశారు. పార్టీకి ద్రోహం చేయకూడదనే ఇన్నాళ్లూ వైసీపీలో ఉన్నానని చెప్పుకొచ్చారు ఎంపీ మోపిదేవి. ఇకపై మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అని ప్రశ్నించగా…తన తదుపరి రాజికీయ వేదిక తెలుగుదేశం పార్టీయేనంటూ కుండబద్ధల కొట్టేశారు.
చదవండి: “పుష్ప 2”, “గేమ్ ఛేంజర్” లపై పొలిటికల్ ఎఫెక్ట్
నాతోపాటే మస్తాన్..?: మోపిదేవి
గురువారం ఎంపీ మోపిదేవి చేసిన వైసీపీ రాజీనామా ప్రకటన రాజకీయవర్గాల్లో చర్చనీయంశంగా మారగా, వైసీపీ శ్రేణులకు మరో షాక్ ఇచ్చే వ్యాఖ్యలు కూడా చేశారు. తాను ఒక్కడినే పార్టీని వీడటంలేదని, తనతోపాటు తన సహచర పార్టీ ఎంపీ బీద మస్తాన్‌రావు కూడా వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించడంతో ఒక్కదెబ్బకు రెండుపిట్టలు అన్నట్టు కథనాలు పుంకాను పుంకాలుగా వచ్చేస్తున్నాయి. సో, చూడాలి…బీద మస్తాన్‌రావు పార్టీని ఎందుకు వీడాల్సివస్తుదో, ఆయన ఏం చెబుతారో అనేది.