నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో… ఎనిమిదేళ్ల బాలిక అదృశ్యమై వారం రోజులు గడిచాయి. ఇప్పటికీ ఆమె జాడ లేదు అత్యాచారం చేశాం. చంపేశాం. ఇది ముగ్గురు మైనర్ల వాంగ్మూలం. కానీ ఆమె శవం దొరక లేదు. నిజాలు బయట పడటం లేదు. కేసు నిరూపణకు ఆధారాలు దొరకటం లేదు. పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. పాత నేరగాళ్లను ఇరికించటానికి వీలులేదు. దృశ్యం 3 సినిమాలో క్షణ క్షణం సస్పెన్స్ స్ర్కీన్ ప్లేను తలపించే రీతిలో.. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యం..హత్యాచారం కేసు దర్యాప్తు సాగుతోంది. ఒరే .. బుడ్డ నాయాళ్లారా? చెప్పండిరా? ఆ శవం ఎక్కడ పడేశారు? నదిలో పడవేశారా? తగలబెట్టారా? ముక్కలు ముక్కలు చేసి పాతి పెట్టారా? చెప్పండిరా, మీ కాళ్లు మొక్కుతాం అనే పోలీసు ఆఫీసర్ల సినీ సన్నివేశం ఈ దర్యాప్తులో చేనుకుందంటే.. ఆశ్చర్య పడనవసరం లేదు. కానీ అసలు నిజం తేలటం లేదు. నేరగాడు.. ఏదోక క్లూ వదిలేస్తాడు. అదే దర్యాప్తునకు అధారం. ఆ ఆధారమే పోలీసుకు ప్రాణం. ఈ కేసులోనూ కచ్చితంగా క్లూ దొరుకుతుంది. కానీ దృశ్యం మీద దృశ్యం ఎపిసోడ్ మారిపోతుంటే.. ఆధారం దొరకక.. ఆ చిన్నారి చావు…బతుకు నిగ్గుతేలటం లేదు. హతవిధీ.
క్షుద్ర పూజ కోణంలో…
బాలిక కోసం పోలీసుల అన్వేషణలో.. ఓ ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగాయనే అనుమానం వ్యక్తమైంది. కానీ ఆ ప్రాంతలో పూలు కుంకుమ దొరికాయి కానీ, రక్తం జాడ లేదు. అంటే అక్కడ బాలికపై క్షుద్ర పూజ జరిపి బలి ఇచ్చారనే ఆధారాలు లభించలేదు. ఇక బాలలు సైకిల్ పై శవాన్ని తీసుకువెళ్లారటానికి ఆధారాలు లేవు. నదిలోనూ.. తుప్పల్లోనూ మృతదేహం దొరకలేదు. ఒకరు మృతి చెందిన మూడు రోజుల్లో మృతదేహం దొరుకుతుంది. నీటిలో తేలి ఆడుతుంది. లేదా బహిరం ప్రదేశంలో కుళ్లిన స్థితిలో కనిపిస్తుంది. ఒక వేళ పాతిపెడితే.. ఆ సమాధి కనిపిస్తుంది. ఈ ఆధారాలేవీ దొరకలేదు. దీంతో కేసు మరింత మిస్టరీగా మారింది. ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో .. ఓ పిల్లోడి తండ్రి గురించి ఆశ్చర్యకర సమాచారం వెలుగు చూసింది. అతడు క్షుద్ర పూజలు నిర్వహిస్తాడట. పైగా మద్యం వ్యాపారి. పోలీసులు అదుపులోకి తీసుకోగానే .. తమ కుమారుడే అత్యాచారం చేశాడని, ఈ కేసు నుంచి తప్పించటానికే ఆమె శవాన్ని కృష్ణానది మధ్యలో పడవేసినట్టు చెప్పాడట. అయితే.. ఆ బాలిక బతికే ఉందా? కిడ్నాప్ చేసి దాచారా? అనే ప్రశ్నలు చిక్కుముడి వేస్తున్నాయి. చిన్న పిల్లలైతే కేసు తీవ్రత తగ్గుతుంది. వీరిని జువైనల్ కోర్టులో శిక్షిస్తారు. ఏడెనిమిది ఏళ్లల్లో మళ్లీ బయటకు వస్తారు. ఈ కోణంలోనే బాలలను తెరమీదకు తీసుకువచ్చారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.