కవిత లాయర్ ఫీజ్ గంటకు ఎంతో తెలుసా ?

Spread the love

కవిత లాయర్‌ ఎవరో తెలుసా?
ఫీజు తెలిస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయ్‌..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు ఐదున్నర నెలలు తీహార్‌జైలులో మగ్గిపోయిన ఎమ్మెల్సీ కవితకు మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ధర్మాసనం ఉత్తనో, జాలిపడో బెయిల్ ఇవ్వదుగా…అందుకు ఆమె తరఫున వాదనలు గట్టిగా ఉంటేనే, ఆ వాదనల్లో సుత్తిలేకుండా సూటిగా ఉంటేనే ధర్మాసనం స్పందన ఉంటుంది. కవిత తరఫున సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు ఆ విధంగా ఉండబట్టే ఈరోజున కవిత జైలు నుంచి ఇంటిబాటపట్టారన్నది న్యాయనిపుణుల మాట. ముకుల్ హై ప్రోఫైల్ కేసులే ఎక్కువగా వాదిస్తారన్న పేరుంది. ఈయన గంటకు రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు వసూలు చేస్తారన్న టాక్ ఉంది.

ఇంతకీ ఎవరీ ముకుల్ రోహత్గీ..?

కవిత తరపున వాదించిన లాయర్ ముకుల్‌ రోహత్గీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 1955 ఆగస్టు 17న ముంబైలో ముకుల్ రోహత్గీ జన్మించారు. గతంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఈయన తండ్రి అవధ్ బిహారీ రోహత్గీ కూడా లాయరే. ప్రస్తుతం ఇండియాలో అగ్రశ్రేణి న్యాయవాదులలో ఒకరైన రోహత్గీ ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీలో లా కోర్సు పూర్తి చేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టులో యోగేష్ కుమార్ సబర్వాల్ వద్ద ప్రాక్టిస్ చేశారు. ముకుల్ సతీమణి వసుధ కూడా లాయరే. వీరికి కుమారులు నిఖిల్, సమీర్ ఉన్నారు. 1999 నవంబరులో ఐదేళ్లపాటు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించింది నాటి ప్రభుత్వం. తరువాత NDA ప్రభుత్వంలో భారతదేశ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ముకుల్ తన పదవీకాలంలో ట్రిపుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు, జాతీయ న్యాయ నియామకాల కమిషన్, ఆధార్ కేసు వంటి విజయవంతమైన కేసులను వాదించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో లా ఆఫీసర్‌గా కూడా పనిచేసిన రోహత్గీ.. 2002 అల్లర్లు , బూటకపు ఎన్‌కౌంటర్ కేసులలో గుజరాత్ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించారు.

కవిత అరెస్ట్‌..బెయిల్‌…సాగిందిలా..!

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. ధర్మాసనం జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో నాటినుంచి ఐదునెలల పైబడి తీహార్‌ జైలులో ఖైదుగా ఉన్నారామె. ఈ క్రమంలో ఆమె పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయితే ఈసారి కవిత తరుపు లాయర్ రోహత్గీ బలంగా వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో రూ.100 కోట్లు చేతులు మారాయన్నది కేవలం ఆరోపణ మాత్రమే. ఇదే కేసులో 493 మంది సాక్షులను విచారించారు. కవిత ఎవరినీ బెదిరించలేదు. ఆమె దేశం విడిచి వెళ్లే అవకాశమే లేదు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందంటూ బలంగా తన వాదన వినిపించారు. ముకుల్ రోహత్గీ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం… సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసింది, ఈడీ విచారణ కూడా పూర్తయింది, ఒక మహిళగా అమెకు బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది.

Hot this week

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..

వైసీపీ మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్...

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!కనీసం ప్రతిపక్ష...

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..!

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..! హోంశాఖ పనితీరు బాలేదన్న డిప్యూటీ సీఎం..!సొంత నియోజకవర్గం...

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!కార్తీకమాసం తొలిసోమవారం దేవభూమి ఉత్తరాఖండ్‌లో...

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌ అయిపోయింది. మరికొన్నిగంటల్లో...

Topics

11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్ హాజరవుతారా?

ఈ నెల 11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బడ్టెట్‌ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా?ఏపీ...

ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..! సీఎంకు ‘ముడా’ ముప్పు.

కర్ణాటక సీఎంకు ‘ముడా’ ముప్పు..! ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..!మైసూర్‌...

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనిత

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనితఏపీలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత...