జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఇప్పటికే ఇండియా కూటమి నేతలు.. సీట్ల సర్దుబాటు విషయంలో ఓ కొలిక్కివచ్చి ఎవరికివారు సీట్లు పంచుకుని రణరంగంలో సిద్ధంగా ఉండగా…బీజేపీ, 15మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించడమే కాదు, తొలివిడత ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెనర్ల జాబితాను కూడా రిలీజ్ చేసింది. జమ్మూకశ్మీర్ లీడ్ క్యాంపెయినర్‌గా ప్రధాని మోదీతోపాటు మొత్తం 40 మందిని స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో చేర్చింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, జేపీ నడ్డా తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అలాగే తొలిదశ ప్రచారానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ హాజరవుతారు.
చదవండి: ఖంగుతిన్న కంగానా..? నో వైలెంట్..ఓన్లీ సైలెంట్..?
ఫలితాలు ఆనాడే తేలేది..?
ఇక ఇండియా కూటమి అంటూ ఎన్సీ-కాంగ్రెస్ పొత్తులు కుదుర్చుకున్న వేళ హస్తంపార్టీ 32 స్థానాల్లో, నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో బరిలోకి దిగనుండగా…మరో ఐదు స్థానాల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పాంథర్స్ పార్టీ, సీపీఎం చెరో సీటును దక్కించుకున్నాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్‌లో మూడు విడతలుగా ఎన్నికలు జరగుతాయి. సెప్టెంబర్ 18, 25 తోపాటు అక్టోబర్ 1న పోలింగ్ జరగనుండగా…మధ్యలో రెండ్రోజుల వ్యవధిలో అంటే అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.