ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామీలీలకు అత్యధిక రిజర్వషన్లు ఇవ్వడానికి వ్యతిరేకంగా చెలరేగిన అల్లరు బంగ్లాదేశ్‌ను భీతిల్లేలా చేశాయి. ఈ అల్లర్లలో సుమారు 200 మందికి పైగా చనిపోయారని అధికారికంగా గణాంకాలు కూడా వెలువడ్డాయి. అయితే, మృతుల సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం ఉందన్నది ఐక్యరాజ్య సమితి వాదన. ఇందుకనుగుణంగా తాను ప్రాథమిక విశ్లేషణ పేరుతో రూపొందించిన నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ రిపోర్ట్ ప్రకారం బంగ్లా అల్లర్లలో 650 మంది మరణించారు…ఒక్క ఆగస్టు 5, 6 తేదీల్లో 250మందికిపైగా చనిపోయారని…బాధితుల్లో ప్రభుత్వ భద్రతా సిబ్బంది, జర్నలిస్టులూ ఉన్నారని తెలుస్తోంది.
అలా మొదలైంది..!
మళ్లీ సాధారణ పరిస్థితికి బంగ్లా..!
రిజర్వేషన్ల పేరుతో బంగ్లాదేశ్‌లో రేగిన చిచ్చు జులై 16 నుంచి మొదలుకుని ఆగస్టు 11 మధ్యకాలంలో అక్కడ అశాంతి రాజేసింది. విద్యార్థులు చేపట్టిన ఈ ఉద్యమం హింసాత్మకంగా మారిపోవడంతో ప్రధాని షేక్ హసీనా సైతం రాజీనామాచేసి, ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. వెంటనే సైన్యం రంగంలోకి దిగి బంగ్లాదేశ్‌ను తన చెప్పుచేతుల్లోకి తీసుకోగా…ప్రజాభీష్టం మేరకు ఈ మధ్యనే నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ తాత్కాలిక పాలకుడిగా పగ్గాలు అందుకోవడం, మళ్లీ అక్కడ సాధారణ పరిస్థితులు తలెత్తడం చకాచకా జరిగిపోయాయి.