ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై టీడీపీ బురద జల్లుతోందని మాజీమంత్రి రోజా మండిపడ్డారు. తాడేపల్లిలో ఆమె మాట్లాడుతూ.. “ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే.. స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు.
స్కామ్ ఇలా కూడా అవుతుందా?. క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా?. నేను, సిద్దార్థ్డ్డి అవినీతి చేశామనడం హాస్యాస్పదమే అవుతుంది” అని అన్నారు.