మహిళా కమిషన్ సభ్యులపై సదరు ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఫైరయ్యారు. విచారణకు పిలిపించిన కేటీఆర్‌కు ఆప్యాయంగా ఆరుగు మహిళా కమిషన్ సభ్యులు కట్టడాన్ని తీవ్రంగా మండిపడ్డ ఆమె…వారందరికీ నోటీసులు జారీచేయాల్సిందిగా మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరళ్ళ శారద ఆదేశాలిచ్చారు. కేసు నిమిత్తం విచారణకు హాజరైన ఓ వ్యక్తికి రాఖీ కడతారా అంటూ మరోవైపు సదరు సభ్యులకు చురకలు అంటించారు.
చదవండి: వలంటర్లీకు గుడ్‌న్యూస్..? కొత్త కొలువుల్లో వలంటీర్లు..?
సందిగ్ధంలో సభ్యుల ఉద్యోగాలు..?
ఉచిత బస్సు ప్రయాణం పథకంపై రాష్ట్రమహిళలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది రాష్ట్ర మహిళా కమిషన్. ఇందులో భాగంగా ఆయన వివరణ ఇచ్చేందుకు సదరు కార్యాలయానికి వెళ్లగా…ఆయన్ను చూసిన మహిళా కమిషన్ సభ్యుల్లో ఆరుగురు పోటీపడి మరీ రాఖీలు కట్టడం కమిషన్ ఛైర్‌పర్సన్ నేరళ్ల శారదకు కోపం తెప్పించింది. అంతేకాదు, నిబంధనలకు విరుద్ధంగా రాఖీ కట్టే విజువల్స్‌తోపాటు విచారణకు హాజరైన కేటీఆర్‌నూ తమ ఫోన్లలో చిత్రీకరించడంపైనా శారదకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఇప్పటికే లీగల్ ఒపినీయన్ తీసుకుంటున్నారని, త్వరలోనే వారందరిపై కఠిన చర్యలు ఉండొచ్చనే వార్తలు కూడా ఒక్కసారిగా గుప్పుమన్నాయి.