ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా నియమితులైన సృజన బుధవారం బాధ్యతలు స్వీకరించడానికి కుమారుడితో కలిసి విజయవాడ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. ఆమె బాధ్యతలు తీసుకొని, మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అమ్మ మాట్లాడేది తాను స్వయంగా చూడాల్సిందేనని కుమారుడు మారాం చేశాడు.
దీంతో కలెక్టర్ కుమారుడిని దగ్గరికి తీసుకొని సముదాయించి వ్యక్తిగత సిబ్బంది వద్దకు పంపించారు.