పరిశ్రమలపై పవన్ ఫైర్..?
సేఫ్టీ ఆడిట్ ఎక్కడా..?
అచ్యుతాపురం సెజ్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్….పరిశ్రమల యాజమాన్యల తీరుపై మండిపడ్డారు. సదరు ఫ్యాక్టరీ యాజమాన్యంలో ఇద్దరు ఉన్నారు…వారెవరూ బాధ్యత తీసుకోవడంలేదని చెప్పారు. అన్ని పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ చేయాలని తాను రాగానే సూచించానని…సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు మూసేస్తారనే భయం యాజమానుల్లో ఉందని తెలిపారు. పరిశ్రమలో పనిచేసే వారి ప్రాణరక్షణ చాలా ముఖ్యం…విశాఖ జిల్లాలో తరచుగా జరుగుతున్న ఈ ప్రమాదాలను తగ్గించడానికి సేఫ్టీ ఆడిట్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది…తొందరలోనే పొల్యూషన్ ఆడిట్ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ప్రమాదం జరిగాక బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, పరిశ్రమల్లో పటిష్టమైన చర్యలతో వారి ప్రాణాలు కాపాడటం ముఖ్యమని పవన్…ఫ్యాక్టరీ యాజమాన్యలపై ఒకింత ఆగ్రహం వ్యక్తంచేశారు.
చదవండి: మోక్షజ్ఞ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..!
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం..?
అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, పేలుడులో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నట్టుగా పీఎంవో కార్యాలయం ప్రకటన విడుదలచేసింది. అలాగే ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 2లక్షల చొప్పున, గాయపడ్డ క్షతగాత్రులకు 50వేలు చొప్పున పరిహారం చెల్లిస్తున్నట్టు X వేదికగా ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా, పేలుడు ధాటికి ఇప్పటి వరకు 17 మంది మృతిచెందగా, 35 మందికి పైగా గాయపడ్డారని సమాచారం.