అన్న క్యాంటీన్ల విషయంలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన మధ్య చిచ్చు రాజుకున్నట్టు కనిపిస్తోంది. క్యాంటీన్లలో పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడంతో జనసైనికుల్లో అంతర్మథనం తలెత్తింది. దీనికి ఆ పార్టీ నేత చెల్లుబోయిన సతీష్ వ్యాఖ్యలే తార్కాణం.
పవర్‌లో ఉన్నాం… పవర్ స్టార్ ఫోటో ఉండాల్సిందే
చదవండి: ఈ వీక్ సినిమాల్లో ప్రమోషన్స్ లో ముందున్న “మిస్టర్ బచ్చన్”
ఆగస్టు 15 నుంచి ఏపీలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తొలివిడతగా 100 క్యాంటీన్లను వివిధ ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాటుచేసిన ఆయా అన్నా క్యాంటీన్లలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడం జనసేన నేతల్లో ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చాలా బాధగా ఉన్నారని అన్నారు జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్. దీనిపై నాలుగురోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్‌కు కంప్లైంట్ చేశామని, క్యాంటీన్లు పునఃప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని…తక్షణం తమ నేత పవన్ కల్యాణ్ ఫొటో క్యాంటీన్లలలో పెట్టాల్సిందేనని చెల్లుబోయిన సతీష్ డిమాండ్ చేశారు.