సత్కరించే వారు పూలబొకేలు తేవద్దని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఆదర్శనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఘన సన్మానం జరిగింది.
ఈ సందర్బంగా అధినేత పవన్ కళ్యాణ్ పండ్లు, కూరగాయల బొకేలు వినియోగించి సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సన్మానాలు, సత్కారాలకు కూరగాయలు, పండ్ల బొకేలు వినియోగించి వాటిని వృద్ధుల ఆశ్రమాల్లో ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచన ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ఆలోచనలను పాటించాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కోరారు.