ప్రశాంత్ కిషోర్ పార్టీ అక్టోబర్ 2న ప్రారంభం..!
పార్టీ ప్రకటన అనంతరం పాదయాత్రలో కిషోర్..?
మరో రాజకీయ పార్టీ ప్రత్యామ్నాయాన్ని బీహార్ ప్రజల ముందుంచారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. తన పార్టీని అక్టోబర్ 2న ప్రారంభిస్తారు. పాట్నా వెటర్నరీ కాలేజీ మైదానంలో పార్టీ ప్రారంభ వేడుక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీపేరు, అలాగే 25మంది సభ్యుల నాయకత్వ బృందాన్ని పార్టీ చీఫ్‌గా ప్రశాంత్ కిషోర్ పరిచయం చేస్తారు. అయితే తాను పార్టీలో ఎలాంటి అధికారిక పదవిని కలిగిఉండనని మీడియా వేదికగా ఇప్పటికే చెప్పిన ప్రశాంత్ కిషోర్…అక్టోబర్ 2 తర్వాత తన పాదయాత్ర కొనసాగింపుపైనే దృష్టిసారిస్తానని తెలిపారు.
చదవండి: మరో క్రేజీ ప్రాజెక్ట్ లో పూజా హెగ్డే
ప్రశాంత్ కిశోర్ పార్టీ ప్రారంభ వేడుకకు 50లక్షలమందికి పైగా వస్తారని జన సూరజ్ నాయకుల అంచనా. రోహ్తాస్ జిల్లాలో ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ప్రశాంత్ కిషోర్…బీహార్‌లో దీర్ఘకాలంగా ఆధిపత్యం చెలాయించిన కుల రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలన్నదే తన లక్ష్యమని తెలుస్తోంది. నితీశ్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌తోపాటు బీహార్‌లోని ప్రముఖ బీజేపీ నాయకులకు సవాల్ విసిరేలా ఓ రాజకీయ పునాదిని బలంగా నిర్మించి ప్రశాంత్ కిశోర్ రావడంతో వారందరికీ ముచ్చెమటలు పడుతున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.
ప్రజాక్షేత్రంలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలనుకున్న ప్రశాంత్ కిషోర్… రెండేళ్ల క్రితం పశ్చిమ చంపారన్‌లోని భితిరహ్వా గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర ప్రారంభించాడు. తొలినాళ్లలో 35వేల కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెటుకున్న ప్రశాంత్, తన లక్ష్యాన్ని 45వేల కిలోమీటర్లకు పొడగించుకుని ఇప్పటికి 55వేల కిలోమీటర్లకు పైగా నడవడం గమనార్హం. అక్టోబర్ 2 తర్వాత అతని ప్రయాణం అరారియాలో కొనసాగనుంది.