సెప్టెంబర్ 20వరకు జైల్లోనే సంజయ్..!
కోల్‌కతా ఆర్జీకర్ కాలేజీ వైద్యవిద్యార్థిని అభయ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చింది సీబీఐ ధర్మాసనం. ఈ కేసును శుక్రవారం విచారించిన సీబీఐ కోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. అయితే, తొలుత నిందితుడి తరఫున కవితా సర్కార్ వాదనలు వినిపించగా… సంజయ్‌కు బెయిల్ ఇస్తే సీబీఐ విచారణకు ఆటంకం కలిగించినట్టు అవుతుందని సీబీఐ తరఫున దీపక పోరియా గట్టిగా వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు చివరికి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ… సెప్టెంబర్ 20 వరకు నిందితుడిని 14రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది.
చదవండి: విమర్శలు సరే…సాయమెక్కడా..?
వెలుగులోకి మాజీ ప్రిన్సిపల్ విలువైన ఆస్తులు…?
సున్నితమైన అభయ హత్యాచార కేసును ఓవైపు సీబీఐ విచారిస్తున్న వేళ…సదరు అనుమానితుల ఆస్తులపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరపగా విలువైన ఆస్తిపత్రాలు బయటపడ్డాయి. అంతేకాదు అతనికి చెందిన రెండంతస్తుల లగ్జరీ ఇంటిని కూడా గుర్తించారు. అలాగే ఆ ఇంటిచుట్టూ వందల ఎకరాల ఖాళీ స్థలం ఉండటంతో….ఈ బంగ్లాతోపాటు అన్ని ఆస్తి పత్రాలు ఘోష్‌తోపాటు తన సతీమణి సంగీత పేర్ల మీద ఉన్నట్టు నిర్థారించారు. మొత్తం 9 ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు సదరు కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రసూన్ ఛటోపాధ్యాయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.