తిరువూరు ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు..?
MLA కొలికపూడిని టీడీపీనుంచి గెంటేయాలన్న మహిళలు
ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నారన్నది మహిళల ఆరోపణ. మరోవైపు మహిళలని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారన్నది కొలికపూడిపై ఉన్న మరో ప్రధాన అభియోగం. ఈ క్రమంలో చిట్టేల అనే గ్రామంలో రోడ్డెక్కి నినదించారు మహిళలు. ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలు తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఆరోపణలను ఖండిస్తూ ఎమ్మెల్యే దీక్ష..?
మహిళల ఆరోపణలు నిజమని తేలితే తనను కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో ఆరోపణలు చేసినవారిని వదలకుండా జైల్లో పెట్టాలని క్యాంప్ ఆఫీస్‌లో దీక్షకు దిగారు ఎమ్మెల్యే కొలికపూడి. అయితే పార్టీ ఆదేశాలతో కొన్ని గంటలకే ఆయన దీక్ష విరమించారు. తనపై ఆరోపణలు చేస్తున్న సదరు మహిళ ఇప్పటికే నాలుగుసార్లు సూసైడ్‌కు పాల్పడిందని కొలికపూడి తెలిపారు. ఆమె భర్తపై పోలీసులు ఎప్పుడు కేసులు పెట్టినా ఇలాగే డ్రామాలు ఆడుతూ ఉంటుందని ఆరోపించారు. తనపై పథకం ప్రకారం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మరని కొలికపూడి ధీమా వ్యక్తంచేశారు.