కొనసాగుతున్న పూరి రత్నాబాండగారం లెక్కింపు

Spread the love

నిధి వందే జగద్గురుమ్‌. రత్నాభాండగారం తలుపులు తెరుచుకున్నాయి. మరి రహస్య గదిలో ఏమున్నాయి? వాటి విలువెంత? మొదటి రోజు రత్న భండాగార తలుపులు తెరచుకున్నాయి. కౌంటింగ్‌ కాసేపే జరిగింది. నేడు రెండో రోజు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే పాత రికార్డులతో లెక్క సరితూగేనా? ఈ లెక్క తేలడానికి సమయం పడుతుంది. 46 ఏళ్ల ఉత్కంఠకు తెరపడింది. ఇప్పుడు అందరి చూపు పూరీ వైపే. పూరీ జగన్నాథుడి సన్నిధిలోని రత్నాభాండాగారంపై ఇన్నాళ్ల మిస్టరీకి ఎట్టకేలకు ఫుల్‌ స్టాప్‌ పడింది. 46 ఏళ్ల తరువాత రత్నా భాండాగారం సీక్రెట్‌ రూమ్‌ తలుపుల్ని తెరిచారు. అమూల్యమైన బంగారు వెండి ఆభరణలు సహా, స్వర్ణ, రత్న, వజ్ర ఖచిత వస్తువులతో రహస్య నిధి జిగేల్మంది. కమిటీ సమక్షంలో వాటిన్నంటిని చెక్క పెట్టేల్లో భద్రపరిచారు. టైమ్‌ లేకపోవడంతో ఆభరణాల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. రహస్య గదికి మళ్లీ తాళం వేశారు. సోమవారం కమిటీ సమక్షంలో నగల లెక్కింపు జరగనుంది.

టేకు చెక్కతో తయారు చేసిన పెట్టెలో భద్రపరచనున్నారు. వీటి లోపల లోహపు పొర ఉంటుంది. ఒడిశాలోని జగన్నాథ దేవాలయం రత్న భండాగారాన్ని తిరిగి తెరవడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్యానెల్‌కు జస్టిస్ విశ్వనాథ్ రథ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. రత్న భండాగారం తెరవడం గురించి సమాచారం ఇస్తూ.. “నిర్ణయించిన ప్రకారం మొదట రత్న భండాగారం తెరచారు. ఆపై రెండు ‘భాండాగారాల్లో ఉంచిన నగలు, విలువైన వస్తువులను లోపల ముందుగా కేటాయించిన గదులకు తీసుకువెళతారు. ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రాగానే రత్నభాండాగారం తలుపుల్ని తెరుస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఆ మాటే బాటగా తలుపులు తెరుచుకున్నాయి. ఐతే గదిలో నగలెన్ని ? వస్తువులెన్ని? రత్న, వజ్ర వైఢూర్యాలెన్ని? ఈ లెక్క తేలడం అంత ఆషామాషీ కాదు. 1978లో వాటిన్నంటిని లెక్కించడానికి 72 రోజులకు పైగా సమయం పట్టింది. మరి ఈసారి ఎంత టైమ్ పట్టే అవకాశం ఉందనేది ఆసక్తికరంగా మారింది.

జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ నేతృత్వంలో కమిటీ సమక్షంలో గది తలుపులు తెరిచారు. ఆలయ ఈవో అరవింద పాడి, పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్‌ స్వైన్, పురావస్తుశాఖ ఇంజినీర్‌ ఎన్‌సీ పాల్‌, పూరీ రాజప్రతినిధితో పాటు ఐదుగురు ఆలయ సేవాయత్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషోత్తముని గర్భగుడి వెనుక శయన మందిరం ఉంది. దీనికి ఎడమవైపు రత్నభాండాగారంలో మూడు గదులున్నాయి. తొలి గదిలో స్వామి నిత్యసేవలకు అవసరమైన ఆభరణాలున్నాయి. పండగలు, యాత్రల్లో ముగ్గురుమూర్తులకు తొడిగే అలంకారాలున్నాయి. మూడో గదిలో వెలకట్టలేని సంపద కర్రపెట్టెల్లో ఉంది. రహస్య గదిలో దీపాలు లేవు. అంతా చీకటి, ఎక్కడ ఏముందన్న దానిపై ఎవరికీ అవగాహన లేదు. స్వామి సంపదంతా లోకనాథ్‌ స్వామి పర్యవేక్షిస్తున్నాడు. శ్రీక్షేత్రానికి రక్షణగా ఉన్న మహాశక్తి విమల, మహాలక్ష్మిల దృష్టి అన్ని వేళలా భాండాగారంపై ఉంటుంది. స్వామి శయన మందిరానికి చేరువలో ఎడమవైపున ఉన్న ఒక గదిని స్ట్రాంగ్‌రూంగా చేశారు. ఇక్కడే లెక్కింపు జరగనుంది.
46 ఏళ్ల తరువాత రత్నభాండాగారం తలుపులు ఆదివారం శుభముహూర్తంలో తెరిచారు. రహస్య గదుల్లో ఉన్న శతాబ్దాల కాలం నాటి పెట్టెలు జీర్ణావస్థలో ఉంటాయన్న అంచనాతో యంత్రాంగం భువనేశ్వర్‌కు చెందిన ఒక కలప మిల్లు యాజమాన్యంతో సంప్రదించి గుగ్గిలం కర్రకు లోపల ఇత్తడిపూత పూసిన ఆరు భారీ సైజు పెట్టెలు తయారు చేయించింది. ఇవి పూరీ శ్రీక్షేత్రానికి చేరుకున్నాయి. మరికొన్ని పూరీ చేరుకుంటాయని తెలిసింది. స్వామి ఆభరణాలు ఈ పెట్టెల్లో భద్రపరిచి స్ట్రాంగ్‌రూంకు తరలించి ఆ తరువాత లెక్కిస్తారు.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...