డోంట్‌వర్రీ, నేను హ్యాపీగా ఉన్నాను: రతన్ టాటా

Spread the love

డోంట్‌వర్రీ, నేను హ్యాపీగా ఉన్నాను: రతన్ టాటా

తనపై వచ్చిన అనారోగ్య వార్తలను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ఖండించారు. అవన్నీ నిరాధార వదంతులని కొట్టిపారేశారు. తానెంతో ఉత్సాహంగా ఉన్నానంటూ బదులివ్వడం కొసమెరుపు.

86 ఏళ్ల వృద్ధాప్యంలో రతన్‌టాటాను ఆస్పత్రికి తరలించారని, క్రిటికల్‌ కండీషన్స్ మధ్య ఆయన్ను ఐసీయూలో చేర్పించారన్న వార్తలు ఓ వైపు మాధ్యమాల్లో సర్కులేట్ అవుతుండగానే… ఆ వార్తలన్నింటినీ ఖండిస్తూ సంతోషంగా ఉన్నా, డోంట్ వర్రీ అని రతన్‌టాటానే బదులిచ్చారు. జనరల్‌ హెల్త్‌ చెకప్‌లో భాగంగా తనను వైద్యులు పరిశీలించారని…అంతేతప్ప ఇందులో మీరనుకున్నంత సీరియస్‌నెస్ ఏమీలేదని, నా గురుంచి ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ రతన్ టాటా చెప్పుకొచ్చారు.

చదవండి: వరుణ్ తో పోటీకి సై అంటున్న మహేష్ మేనల్లుడు

తన ఆరోగ్యం గురించి ఇటీవల కాలంలో చాలా వదంతులు వస్తున్నాయని, అందువల్లే కచ్చితమైన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చి ఈ విధంగా స్పందించానని X వేదికగా పోస్‌ చేశారు రతన్‌ టాటా.

నిజాలను వక్రీకరించొద్దన్న రతన్‌టాటా

నా వయస్సు రీత్యా, సంబంధిత పరిస్థితుల కారణాన ప్రస్తుతం వైద్యులతో చెకప్‌ చేయించుకుంటున్నానని రతన్‌టాటా స్పష్టీకరించారు. అంతేకాదు, మీడియా కూడా వాస్తవాలు తెలుసుకుని ప్రసారం చేయాలని హితవుపలికారు. ప్రజల్లో అపోహలు, భయం కలిగేలా వార్తలు రాయొద్దని సూచించారు.

దాదాపు 13 మిలియన్ల ఫాలోవర్లు కలిగిన తన ఇన్‌స్టా అకౌంట్‌లో అనేక అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు రతన్‌టాటా. మనదేశ పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన నిర్ణయాలతో టాటా సంస్థను నం.1గా నిలిపిన బిజినెస్‌మ్యాన్‌గానే రతన్‌టాటా అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయనలోని పరోపకారి, సాయం చేసే గుణం అందరికీ తెలుసు. ఇన్‌స్టా అకౌంట్‌లో కుక్కల హక్కుల గురించి హృదయాన్ని తట్టే అనేక కథనాలు పోస్టుచేసి పర్యావరణ, జంతుప్రేమికుల హృదయాలను గెలవడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు.

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...