సజ్జల పరువునష్టం దావా..?
వ్యక్తిత్వ హననమేనన్న సజ్జల..!
ముంబై నటి జెత్వానీ కేసులో తనపై తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని…’ముంబై నటికి వేధింపులు…సజ్జల సహాయం’ అన్న శీర్షికన కథనం ప్రచురించిన ఈనాడుతోపాటు…టీడీపీ ఆఫీస్ కేంద్రంగా తనపై అనుచితంగా మాట్లాడిన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పరువునష్టం దావా ఫైల్ చేశారు. ఈ క్రమంలో తన లాయర్‌చే వారికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. కూటమి ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టకుండా…ఇలా తమలాంటి వారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుందని సజ్జల దుయ్యబట్టారు.
చదవండి: సొంత అన్ననే వదలని సీఎం రేవంత్…
సజ్జలను ‘వర్ల’ ఏమన్నారు..?
ముంబై నటి జెత్వానీకి వైసీపీ ప్రభుత్వంలో టార్చర్ కథనాలను ఉఠంకిస్తూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్రస్థాయిలో సజ్జలపై విరుచుకుపడ్డారు. వైసీపీ వాళ్ల గెస్ట్‌హౌస్‌లో ముంబై నటిని పోలీసులే విచారణ చేశారా…లేక, సజ్జలే చేశారా అన్నది విచారణలో తేలాల్సి ఉందని అన్నారు. ముంబై నటి జెత్వానీని విజయవాడ తీసుకొచ్చాక కచ్చితంగా సజ్జల ఆమెవద్దకు వెళ్లే ఉంటారన్న సందేహం కూడా వ్యక్తంచేశారు. ముంబై నటిని మానసికంగానో, ఇంకోరకంగానో హింసించేందుకు సజ్జల వేసిన హానీట్రాప్ ఇది అని వర్ల రామయ్య వాగ్భాణాలు ఎక్కుపెట్టారు. సజ్జల బూతు బాగోతం అందరికీ అర్థమైందన్న ఆయన…సజ్జల తాపేదార్లుగా ఐపీఎస్‌లు కాంతీ రాణా టాటా, విశాల్ గున్నీ వ్యవహరించడాన్ని వర్ల రామయ్య మీడియా వేదికగా తూర్పారబట్టారు. మొత్తానికి జెత్వానీ కేసులో వరుస కథనాలు, వర్ల రామయ్య మాటల తూటాలతో సజ్జల పరువునష్టం దావా వేయడం జరిగింది.