ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోమంటారు ఎందుకో తెలుసుకుందాం?

Spread the love

సీతాదేవి లంకలోని అశోకవనంలో తాను ఉన్నంత కాలం ప్రతి రోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకునేదట. రావణసంహారం అనంతరం అయోధ్యకు తిరిగి సీతాదేవి వెళ్లేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చేయాలని అనుకున్నదట. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది. దానికి గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది. ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కళకళలాడుతుందో సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిందట. అందుకు గోరింటాకు చెట్టు నిజాయితీకి సీతాదేవి మెచ్చి.. గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది.

అది ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. ముఖ్యంగా ఆషాడమాసంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అదే ఈచెట్టుజన్మకు సార్ధకత అని చెప్పిందట. అలాగే అందరూ గోరింటాకుచెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటు ఉంటారు అని వరం ఇచ్చింది.
ఆసమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా‌ ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో?అప్పుడు నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని సీతమ్మతో ఆ సందేహం చెప్పగా నుదుటన గోరింటాకు పండదు అంటుంది.

కావాలంటే చూడండీ గోరింటాకు నుదుటన పండదు

పెద్దోళ్ళు ఏంచెప్పినా దూరదృష్టితోనే చెబుతారండీ. గోరింటాకు చెట్టును ఆషాడమాసంలో ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకలసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది.

అందుకే ఆషాడ మాసంలో గోరింటాకును మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలుండవని
శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.

“ఆషాడమాసం” లో చేతులకు గోరింట పెట్టుకోవడం ఒక ఆచారంగా మన సమాజంలో స్థిరపడింది. అలంకరణలో భాగమని భావించినా, దీని వెనుక ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. గోరింటాకు మహిళల చేతులకూ, పాదాలకూ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇదేదో అలంకరణ కోసం తెచ్చిన ఆడంబరం కాదు.

గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

ఆషాఢ మాసంలో వాతావరణ ప్రభావం వల్ల అనేక సూక్ష్మ క్రిములు వ్యాపిస్తూ ఉంటాయి.
వానల రాకతో గాలిలో, నీటిలో వీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తేమలో ఉండే సూక్ష్మ క్రిముల ప్రభావం చేతులు ద్వారా, పాదాల ద్వారా చర్మరంధ్రాల గుండా శరీరంలో ప్రవేశించకుండా గోరింటాకు కవచంగా పనిచేస్తుంది.

గోరింటాకు ఒత్తిడిని, వేడిని తగ్గిస్తుంది. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు ఆ నాడుల్లో ఏర్పడే అతి ఉష్ణాన్ని లాగేస్తుందని, తద్వారా గర్భాశయ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నది ఆయుర్వేదం.

Hot this week

వెంకీ కి సీక్వెల్ చేయాలని ఉంది :శ్రీను వైట్ల

దర్శకుడిగా 25 ఏళ్ల జర్నీ చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఊహించని...

అరియానా, వివియానా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ .

అరియానా, వివియానా పుట్టిన రోజు సందర్భంగా పాత్రలని పరిచయం చేసిన ‘కన్నప్ప’...

ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్ 20న.

సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్...

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్.

సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్ సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ ని...

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు రిలీజ్.

దిల్ రాజు ప్రెజెంట్స్, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ సిసిరోలియో, రమణ...

Topics

వెంకీ కి సీక్వెల్ చేయాలని ఉంది :శ్రీను వైట్ల

దర్శకుడిగా 25 ఏళ్ల జర్నీ చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఊహించని...

అరియానా, వివియానా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ .

అరియానా, వివియానా పుట్టిన రోజు సందర్భంగా పాత్రలని పరిచయం చేసిన ‘కన్నప్ప’...

ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్ 20న.

సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్...

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్.

సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్ సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ ని...

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు రిలీజ్.

దిల్ రాజు ప్రెజెంట్స్, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ సిసిరోలియో, రమణ...

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ కు సుకుమార్ ప్రశంసలు.

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా టీజర్...

హైదరాబాద్ నడిబొడ్డున పుష్ప వైల్డ్ ఫైర్ జాతర.

హైదరాబాద్ నడిబొడ్డున పుష్ప వైల్డ్ ఫైర్ జాతరఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ తో ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా క .

మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని...