తమ స్కూల్ మాత్రం కూల్చొద్దన్న ఎంఐఎం..!
తనపై బుల్లెట్లతో దాడి చేయండన్న అక్బరుద్దీన్..!
హైడ్రాపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడ ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై స్పందించిన ఆయన…కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి…ఆ స్కూల్ కూల్చకండి…పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగ్‌లు నిర్మించా..వీటిని కావాలని తప్పుగా చూపిస్తున్నారు…గతంలో నాపై కాల్పులు జరిగాయి…కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించడని అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పేదల విద్యాభివృద్ధికి అడ్డుపడకండని అక్బరుద్దీన్ సూచించారు. కాగా, బండ్లగూడలో చెరువు కబ్జాచేసి ఓవైసీ బ్రదర్స్ కాలేజీ కట్టారని హైడ్రాకు ఫిర్యాదులు రావడం…ఈ క్రమంలో ఓవైసీ కాలేజీని కూల్చివేస్తారన్న ప్రచారం జోరందుకున్న వేళ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చదవండి: ఈ వయసులో మూడోపెళ్లా..?
హైడ్రాపై ఎంపీ అసద్ ఫైర్..!
హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం అధినేత తీవ్రంగా స్పందించారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్)లో కట్టారని, వాటిని కూడా కూల్చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెక్లెస్‌రోడ్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది…దాన్ని కూడా తొలగిస్తారా అంటూ ఫైరయ్యారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేది…మరి ఇప్పుడు ఆ కార్యాలయ పరిస్థితి ఏంటంటూ రేవంత్ తీసుకున్న హైడ్రా చర్యలను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.