జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్

Spread the love

ఢిల్లీ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు షాకింగ్‌ కలిగిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ఉండి ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అన్నారు. కేసులు ట్రయల్‌ ప్రారంభం కాకుండానే ఇన్ని కేసులు ఎలా ఫైల్‌ చేశారంటూ సీబీఐని న్యాయమూర్తి ప్రశ్నించారు.

కేసులు నమోదు అయిన నాటి నుంచి ఆరుగురు జడ్జిలు మారిపోయారని, రిటైర్‌ అయ్యారని, గత పదేళ్లుగా కాలయాపన చేస్తున్నారంటూ రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దీనికి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పంటూ మరో కోర్టుకు ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా తప్పంటూ మరో కోర్టుకు వెళ్తూ కాలయాపన చేస్తున్నారని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల ఉత్తర్వులు తప్పు అని చేస్తున్న వ్యవహారానికి ట్రయల్‌కి సంబంధం లేదని జస్టిస్‌ ఖన్నా వ్యాఖ్యానించారు.

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని, విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు. తెలంగాణ నుంచి డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తున్నారని, కోర్టు సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట చెప్పారు. సీబీఐ తరఫు వాదనలు వినిపించడానికి ఎ.ఎస్‌.జి.రాజు అందుబాటులో లేరని ఇతర న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఎ.ఎస్‌.జి. రాజును వెంటనే పిలిపించాలంటూ విచారణను ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు.

Hot this week

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

Topics

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...