తమిళనాట మరో పవన్..?
పార్టీ జెండాతో విజయ్ రాక..!
తమిళనాట రాజకీయాల్లో ఉన్న అనుమానాలను పటాపంచాలు చేశారు హీరో విజయ్ దళపతి. కొన్నాళ్లక్రితం రాజకీయ ఆరంగేట్రం చేసిన ఈ హీరో తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ జెండాను రిలీజ్ చేసి మిగతా రాజకీయ పక్షాలకు దడ పుట్టించేలా చేశారు. పనయూర్‌లోని పార్టీ ఆఫీస్‌లో జెండా ఆవిష్కరించిన అనంతరం పార్టీ యాంథమ్ సైతం రిలీజ్ చేశారు. తమిళిగ వెట్రి కళగం పార్టీ జెండాను చూస్తే ఎరుపు, పసుపు రంగులతో రెండు యుద్ధ ఏనుగులు మధ్యలో సూర్యకిరణాలతో నిండిఉంది. ఈ నెల 19న పనైయూర్ పార్టీ ఆఫీస్‌లో విజయ్ చేపట్టిన పార్టీ జెండా ఆవిష్కరణ రిహార్సల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చెప్పిందే చేశాడు తలైవా..?
రాజీకీయాల్లోకి రావాలా వద్దా అన్న మీమాంసంలో వెనుదిరిగిన సూపర్ స్టార్ రజనీకాంత్‌లా… విజయ్ కూడా తప్పుకుంటారని అంతా భావించిన వేళ చాపకిందనీరులా తన రాజకీయ పార్టీ కార్యకలాపాలను చేసుకుంటూ పోతూ, ఇదిగో ఇవాళ జెండా ఆవిష్కరించి అందరి నోళ్లు మూయించేలా చేశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
చదవండి: అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు..
ఆనాడే పార్టీపేరు ప్రకటన..!
సీఈసీ వద్ద రిజిస్టరూ పూర్తి..?
నటుడు విజయ్ తమిళగ వెట్రి కళిగం పార్టీని ప్రారంభించింది గడిచిన ఫిబ్రవరిలోనే. అలాగే ఢిల్లీ వెళ్లి తన పార్టీ పేరును కూడా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరూ చేయించారు. ఆ తర్వాత విజయ్ విడుదల చేసిన ప్రకటన సారాంశం ఏంటంటే….2026 శాసనసభ ఎన్నికలే తమ టార్గెట్ అని కుండబద్దలకొట్టేశారు. కాగా, సదరు విజయ్ పార్టీలో తమిళనాట వ్యాప్తంగా 2 కోట్ల మందిని పార్టీలో చేర్చుకునే పని జోరుగా సాగుతోందని తెలుస్తోంది.