తెలంగాణ పార్టీపైనే ఇప్పుడు బాబు ఫోకస్‌..?

Spread the love

విభజన అనంతరం ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కేసీఆర్…కూకటివేళ్లతో రాష్ట్రంలో ఉన్న టీడీపీని పెకిలించేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా పార్టీకి పునరుజ్జీవం అందించేందుకు చంద్రబాబు మళ్లీ సమాయత్తమైనట్లు తెలుస్తోంది. ఏపీ మాదిరిగా శ్రేణులు కష్టపడితే తెలంగాణలో మళ్లీ టీడీపీ పుర్వవైభం సాధిస్తుందని బలంగా ఉన్నారట. మరోవైపు తన శిష్యుడు, ప్రస్తుత కాంగ్రెస్‌ సీఎం రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టడం చంద్రబాబుకి మరింత కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారట. తెలంగాణలో టీడీపీని బలపరచడం ద్వారా, కేసీఆర్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ను నామరూపాలు లేకుండా చేయొచ్చన్న ఆలోచనలోనూ రేవంత్ ఉన్నారని, ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడంలో చంద్రబాబు వడివడిగా అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

టీటీడీపీ నూతన అధ్యక్షుడు ఎంపికపై చర్చ..?

ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై దృష్టిసారించని తెలుస్తోంది. తెలంగాణ పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించబోతున్నారనే టాక్‌ అయితే బాగా నడుస్తోంది. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో జరిగే సమావేశంలో ఈ అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే సభ్యత్వ నమోదు తప్పనిసరని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ అంశంపైనా అధినేతగా బాబు శ్రేణులకు దిశానిర్దేశనం చేస్తారని సమాచారం.

చదవండి: ఆదివారం నెత్తురోడిన పాకిస్తాన్‌..!

పాతకమిటీలు రద్దుతో పునఃప్రారంభం..

టీడీపీ ప్రక్షాళనలో భాగంగా చంద్రబాబు గతంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ టీడీపీలో పాత కమిటీలను ఇప్పటికే రద్దుచేసిన ఆయన..ఏపీ, తెలంగాణలో ఒకేసారి పార్లమెంట్‌, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కమిటీలను పునరుద్ధరిస్తారని తెలుస్తోంది. కాగా, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఇకపై నెలలో రెండ్రోజులు రాష్ట్రానికి వస్తానని చంద్రబాబు చెప్పిన విషయం విదితమే.

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...