ఏపీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతిచెందింది. భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని శ్రీదేవి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.