ఆగని ‘అభయ’ ఘటనలు..?
నిన్న బద్లాపూర్…నేడు అకోలా..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికో అభయ హత్యాచార కేసును ఓ వైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగానే పలురాష్ట్రాల్లో కామాంధుల ఆగఢాలు మాత్రం ఆగడంలేదు..మంగళవారం బద్లాపూర్‌లో ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై అటెండర్ అక్షయ్ షిండే చేసిన లైంగికదాడితో స్థానిక గ్రామంలో ఉవ్వెత్తున ఆగ్రహజ్వాల ఎగసిపడటంతో బాధ్యులైన స్కూల్ స్టాఫ్ అందరినీ సస్పెండ్ చేసింది అధికార యంత్రాంగం. ఈ ఘటన జరిగి 24 గంటలు కాకముందే మహారాష్ట్రలో మరో ‘అభయ’ ఉదంతం వెలుగుచూడటం అందరినీ నిశ్చేష్టులను చేస్తోంది.
చదవండి: సీబీఐకి బాబు ఆహ్వానం..?
అకోలా నిందితుడు అరెస్ట్..!
పోక్సో చట్టం కింద కేసు ఫైల్..!
అకోలాలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు బాలికలకు అసభ్యకర వీడియోలు చూపిస్తూ లైంగికంగా వారిని వశపరచుకునే ప్రయత్నం స్థానికంగా కలకలం రేపింది. బాధిత విద్యార్థునులు ఆరుగురు కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా కాజిఖేడ్‌కు చెందిన ఉపాధ్యాయుడు ప్రమోద్ మనోహర్‌పై కేసునమోదు చేసిన అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై అకోలా ఎస్పీ బచ్చన్ మాట్లాడుతూ బాధితుల వాంగ్మూలాలను నమోదుచేశామని…నిందితుడిపై బీఎన్‌ఎస్, పోక్సో చట్టంలోని సెక్షన్ 74, 75 కింద కేసునమోదు చేసినట్లు తెలిపారు.