దసరా ఉత్సవాలకు తెలంగాణ సర్కార్ రెడీ..!
బుధవారం నుంచి 10రోజులపాటు బతుకమ్మ సంబురం..!
తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ సంబురాలు జరుపుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. చివరి రోజైన అక్టోబర్ 10న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించబోతున్నారు. 9రోజుల బతుకమ్మ పండుగను మహిళలు రంగురంగు పూలతో బతుకమ్మను పేర్చి, ఆడటం ఆనవాయితీగా వస్తోంది.
చదవండి: చెన్నై ఆపోలో ఆస్పత్రిలో సూపర్‌స్టార్‌కు స్టెంట్..?
9రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ సంబురం…తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నాన బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. అయితే, ఒకటో రోజునుంచి 9వ రోజు వరకూ పూలు పేర్చి, ఆడుకునే ఈ బతుకమ్మ సంబురంలో…ఆరోరోజు అలిగిన బతుకమ్మనూ ఎవరూ ఆడరు. ఎందుకంటే, ఆరో రోజైన అశ్వయుజ పంచమినాడు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పూజిస్తారు. ఆ రోజున అమ్మవారు అలిగి ఉంటారని, అందువల్లే ఏమీ తినరని పండితులు చెప్తారు. అందుకే ఆ రోజు నైవేద్యాలు ఏవీకూడా మహిళలు సమర్పించరు.