కర్నూలు జిల్లా ముచ్చుమర్రులో బాలిక గల్లంతు ఘటన మలుపులు మీద మలుపులు తిరుగుతోంది. అత్యాచారం చేసి చంపేశామని ఆ ముగ్గురు మైనర్లు చెప్పారు. అదిగో నీటి పడవేశాం అన్నారు. ఇప్పుడు పాతిపెట్టాం అన్నారు. తీరా చూస్తే అక్కడ శవం లేదు. అసలీ మిస్టరీ చేధించటానికి పోలీసులు జట్టు పీక్కుంటున్నారు. ఇక ఆగలేక… చిన్నారి అమ్మానాన్ననూ ప్రశ్నించటం పోలీసులు ప్రారంభించారు.
అమ్మను ఒకచోట.. నాన్నను మరో చోటకు తరలించారు. నాన్న ఫోన్ కాల్ డేటానూ పరిశీలిస్తున్నారు. ఇక ఈ ముగ్గురు పిల్లగాళ్లనూ ప్రశ్నిస్తున్నారు. ఎనీ హౌ.. ఈ రోజు సాయంత్రానికి చిన్నారి జాడ తెలిసే అవకాశం ఉన్నట్టు పోలీసు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కట్టు కథ ఎవరిది? పిల్లగాళ్లదా? పెద్దలదా? ఇంతకీ ఆ చిన్నారి బతికే ఉందా? ప్చ్.. పోలీసుల్లో టెన్షన్.. టెన్షన్.